Monday, September 22, 2025

హృదయాన్ని తాకే ట్రైలర్

- Advertisement -
- Advertisement -

‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్‌గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలమ్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా ధనుష్‌కి ఇది నాలుగో మూవీ. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తన తండ్రిని ఒప్పిస్తూ ఇడ్లీ గ్రైండర్ కొంటే పని తేలిక అవుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది అని చెప్పే సన్నిశంతో మొదలైన ట్రైలర్ అధంత్యం ఆకట్టుకుంది. ధనుష్ ఈ సినిమాలో మురళి పాత్రలో నటిస్తున్నారు. తన తండ్రి దగ్గర ఉన్న సంప్రదాయ ఇడ్లీ కొట్టు మీద మురళీకి చాలా అనుబంధం ఉంటుంది.

ఆ ఇడ్లీ బండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లందరికీ చాలా సెంటిమెంట్. మురళి హోటల్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లి, అరణ్ విజయ్ చేసిన అశ్విన్ పాత్రతో కలిసి పనిచేస్తాడు. వ్యాపారం లాభాలు పెరగడానికి మురళి సహాయం చేస్తాడు. కానీ అశ్విన్ నుంచి వచ్చే బెదిరింపులు మురళి భవిష్యత్తు మాత్రమే కాదు, తన తండ్రి పేరు, వారసత్వానికి సవాల్‌గా మారుతాయి. దాంతో మురళి ఎదుర్కోబోయే సవాళ్లు, తన గౌరవం కోసం చేసే పోరాటమే కథలో ప్రధానంగా మారుతుంది. ట్రైలర్‌లో ధనుష్ నటన అదిరిపోయింది. నిత్యా మీనన్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అరణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్ పాత్రలు కూడా కీలకంగా వున్నాయి. శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. డ్లీ కొట్టు తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.

Also Read : డబుల్ బొనాంజా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News