Monday, September 22, 2025

సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న సీతక్క

- Advertisement -
- Advertisement -

ములుగు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పి షబరిష్ లతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పర్యాటక పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, దిశా నిర్దేశం చేశారు.  ఈ సమావేశంలో ఎ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ డిఒ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఇఒ వీరస్వామి, ఎ పి ఓ వసంత రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News