Monday, September 22, 2025

‘ఒజి’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ యాక్షన్ అదిరిపోయింది..

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఒజి’. మాఫియా, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. సినిమా ట్రైలర్ విడుదల కాకపోవడంపై పవన్ అభిమానులు దిగులు చెందారు. కానీ, అందరి ఎదురుచూపులకు స్వస్తి పలుకుతూ.. సోమవారం చిత్ర ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘‘బాంబే‌లో గ్యాంగ్‌వార్స్ మళ్లీ మొదలయ్యాయి’’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. పవన్‌ (Pawan Kalyan) మునుపెన్నడూ లేనంత వాయిలెంట్ పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారని.. ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా.. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటించింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ‘ఒజి’ ట్రైలర్‌ని చూసేయండి..

Also Read : హృదయాన్ని తాకే ట్రైలర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News