హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఒకే ఒక్క సినిమాతో ప్రశాంత్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే హనుమాన్ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన వద్ద 20 వరకూ సూపర్‌హీరో కథలు ఉన్నట్లు తెలిపారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఒక్కొక్కటిగా ఈ చిత్రలను విడుదల చేస్తామని తెలిపారు. (Adhira)
తాజాగా ప్రశాంత్ వర్మ రూపొందించిన మరో సూపర్ హీతో వెండితరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అతడే ‘అధీర’ (Adhira). తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు. కళ్యాణ్ దాసరి ఈ సినిమాతో హీరోగా చరియం అవుతన్నాడు, ఎస్‌జె సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పోస్టర్లో అగ్నిపర్వతం బద్ధలైనట్లుగా చూపించారు. కల్యాణ్ సూపర్ హీరో గెటప్‌లో ఉన్నాడు.
అయితే ఈ సినిమాకు ప్రశాంత్ దర్శకత్వం చేయట్లేదు.. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకుడు. కానీ, ప్రశాంత్ వర్మ సూపర్విజన్లో ఈ సినిమాతెరకెక్కనుంది. ఆర్కెడి స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాని రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
Also Read : భారీ యాక్షన్ సీన్స్ కోసం స్టంట్స్ ప్రాక్టీస్