Tuesday, April 30, 2024

‘హను-మాన్’లో అంజమ్మ పాత్ర నా కెరీర్ లో డిఫరెంట్ రోల్

- Advertisement -
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో హను-మాన్ లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ హను-మాన్ కథ, మీ పాత్ర గురించి చెప్పినపుడు ఎలా అనిపించింది ? ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
-ప్రశాంత్ వర్మ గారు ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. తప్పకుండా చేయాలనే ఫీలింగ్ కలిగింది. ఇందులో తేజకి అక్క పాత్రలో కనిపిస్తాను. బ్రదర్, సిస్టర్ మధ్య వుండే సరదా సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. చాలా క్యూట్ గా వుంటాయి. ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇది సూపర్ హీరో ఫిల్మ్. ఇందులో తేజ సూపర్ హీరో. నేను కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాను. అది ట్రైలర్ లో చూసే వుంటారు. ఒక మాస్ హీరోకి ఉన్నంత ఎలివేషన్ వుండే యాక్షన్ సీక్వెన్స్ అది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు ఎంత అద్భుతంగా కథ చెప్పారో అంత అద్భుతంగా సినిమా తీశారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ చిత్రం ఇంత పెద్ద స్కేల్ లో గ్రాండ్ గా రావడం చాలా ఆనందంగా వుంది. ఆడియన్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తోంది. తేజ, ప్రశాంత్, నిర్మాత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ చిత్రం అద్భుతంగా అలరిస్తుందని ఆశిస్తున్నాను.

షూటింగ్ సమయంలో తేజ, దర్శకుడు ప్రశాంత్ కు మీరేమైనా ఇన్పుట్స్ ఇచ్చారు?
-ప్రశాంత్ చాలా ఫోకస్ గా వుంటారు. తనకేం కావాలో పూర్తి క్లారిటీ తనలో వుంటుంది. తేజ, ప్రశాంత్ మధ్య మంచి సింక్ వుంది. పైగా ప్రశాంత్ ఒక్క టేక్ లో ఓకే చెప్పే డైరెక్టర్ కాదు (నవ్వుతూ) తను అనుకున్నది వచ్చే వరకూ రాజీపడరు. అయితే ఏదైనా బెటర్ మెంట్ కి ఉపయోగపడుతుందంటే ఇన్ పుట్ తీసుకుంటారు.

మీరు పెద్ద స్టార్స్,పెద్ద బడ్జెట్ లు సినిమాలు చేశారు.. హనుమాన్ చేసినప్పుడు ఎలా అనిపించింది?
-నిజానికి నాకు ఎలాంటి తేడా కనిపించలేదు. తొలి రోజు సెట్ లో అడుగుపెట్టినప్పుడు .. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ వున్నాయి. అప్పుడే సినిమా క్యాలిటీ అర్ధమైయింది. ఇది పెద్ద బడ్జెట్ సినిమాలానే తీస్తున్నారనిపించింది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి హ్యాట్సప్ చెప్పాలి. హను మాన్ ని చాలా అద్భుతంగా నిర్మించారు. దర్శకుడి విజన్ ని అర్ధం చేసుకునే నిర్మాత నిరంజన్ గారు.

వీరసింహారెడ్డి, క్రాక్, కోటబొమ్మాలి పీఎస్ చిత్రలలో మీరు చేసిన పాత్రలకు గ్రే షేడ్ వుంటుంది. హనుమాన్ లో పాజిటివ్ పాత్రలా అనిపిస్తోంది. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారు?
-ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు. నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో కొత్తదనం వుటుందనే పేరు వచ్చింది. ఆ పేరుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను. హను-మాన్ లో చేస్తున్న అంజమ్మ పాత్ర కూడా భిన్నంగా వుంటుంది.

హీరోయిన్ పాత్రలపై ఎక్కువగా ద్రుష్టి పెట్టకపోవడానికి కారణం ?
-నటనలో ఎప్పుడూ హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ అని చూడను. మొదటి నుంచి ఈ అలవాటు లేదు. వీరసింహారెడ్డి గురించి మాట్లాడినప్పుడు ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుకు వస్తుంది. అది నాకు ముఖ్యం. కథలో నా పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అనేదే చూసుకుంటాను. కొంతమందికి నా పేరు తెలీదు. వాళ్ళు నన్ను జయమ్మ, భానుమతి అని పిలుస్తారు. ఇదే నాకు అసలైన అవార్డ్.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు మీ వర్క్ ని అభినందించడం ఎలా అనిపించింది ?
చిరంజీవి గారు నన్ను అభినందించడం చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక అవార్డ్ లా అనిపించింది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశాను.

డ్రీమ్ రోల్స్ చేయాలనే ప్లాన్ ఏమైనా ఉందా ?
నేను ప్లాన్ చేయడం ఆపేశాను. నేను ప్లాన్ చేసినట్లుగా ఏదీ జరగలేదు(నవ్వుతూ). జీవితంలో జరగాల్సింది జరిగిపోతుంది.

బాలీవుడ్ కి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా ?
నేను ఎప్పుడూ భాష గురించి అలోచించలేదు. ఎక్కడ మంచి రోల్ దొరికితే అది చేస్తాను. హిందీలో కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ పాత్రలు అంత ఆసక్తికరంగా అనిపించలేదు.

నాన్నగారు మీ చిత్రాలు చూస్తారా ?
నా ప్రతి సినిమా చూస్తారు. కోటబొమ్మాలిలో నా పాత్ర ఆయనకి చాలా నచ్చింది.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
సుదీప్ గారి మ్యాక్స్ సినిమా చేస్తున్నాను. ధనుష్ D50 లో చేస్తున్నాను. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News