Sunday, May 5, 2024

రూ.200 కోట్ల క్లబ్‌లో ‘హనుమాన్’

- Advertisement -
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ అన్ని ప్రాంతాలలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే వుంది. ఈ చిత్రం గ్రాండ్‌గా సెకండ్ వీకెండ్ రన్ ని పూర్తి చేసుకొని 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదో స్థానంలో నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. లిమిటెడ్ రిలీజ్, మినిమమ్ టికెట్ ప్రైస్ అయినప్పటికీ, హనుమాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నార్త్‌లో కూడా అద్భుతంగా దూసుకుపోతోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం హనుమాన్ సినిమా జోరు ఇంకా బలంగా ఉండబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News