Tuesday, September 23, 2025

ఆసీస్‌-ఎతో రెండో మ్యాచ్.. శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

లక్నో: టీం ఇండియా బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అతను భారత్-ఎ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్ట్‌ల సిరీస్ జరుగుతోంది. అయితే రెండో టెస్ట్‌కి ముందుకు భారత-ఎ జట్టు నుంచి శ్రేయస్ వైదొలిగాడు. శ్రేయస్ తప్పుకోవడంతో అతని స్థానంలో ధృవ్ జురేల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వ్యక్తిగత కారణాల వల్ల శ్రేయస్ లక్నో నుంచి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆసీస్-ఎ జట్టుతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో శ్రేయస్ (Shreyas Iyer) బ్యాట్‌తో విఫలమయ్యాడు. 13 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియన్ ఆఫ్ స్పిన్నర్ కోరి రోకిసియోలి బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే బంతి లెగ్‌స్టంప్ అవతలకు వెళ్తున్నట్లు కనిపించింది. అయినా కూడా అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించారు. ఇక ఇండియా-ఎ జట్టు లైనప్‌లో మరో మార్పు చోటు చేసుకుంది. ఖలీల్ అహ్మద్ స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.

Also Read : రెండు రికార్డులు సృష్టించిన అభిషేక్ శర్మ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News