Tuesday, September 23, 2025

ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తా: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కృష్ణా జలాల్లో న్యాయపరమైన వాటా సాధిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ లో సమర్థమైన వాదనలు వినిపిస్తామని అన్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్ లో వాదనలు జరుగుతాయని, ట్రైబ్యునల్ లో వాదనల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లారు. ఈ సందరర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తానని, బ్రిజేష్ ట్రైబ్యునల్-2 ఉమ్మడి ఎపికి 1050 టిఎంసిలు కేటాయించిందని తెలియజేశారు. ఇప్పుడు కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70 శాతం వాటా కోరుతున్నామని, నదీ పరివాహకం, సాగు భూమి, జనాభా ఆధారంగా అధిక వాటా కోరుతున్నామని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కేవలం 299 టిఎంసిలకే అంగీకరిస్తూ మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం సంతకం చేసిందని, అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపి ప్రభుత్వం కృష్ణా బేసిన్ అవతలకు జలాలను తరలిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు అడ్డుకుని తీరుతామని, తెలంగాణ జల హక్కులను కాపాడుందుకు ఎవరితోనైనా పోరాడుతామని త్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.

Also Read : దక్కన్ సిమెంట్‌లో యుద్ధకాండ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News