కృత్రిమ మేధ (ఎఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఏది అసలో, ఏది నకిలీయో తెలుసుకోవడం కష్టంగా మారిపోంిది. చాలా మంది సెలబ్రిటీలు ఈ ఎఐ టెక్నాలజీ వల్ల ఇబ్బందులు ఎదురుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ ఎఐ బారీన పడ్డారు. అక్షయ్ కుమార్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆయన స్వయంగా అక్షయ్ స్పందించారు.
తాను మహర్షి వాల్మీకి అనే పాత్ర చేయడం లేదని.. ఆ పాత్రకు సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో కూడా ఈ వీడియో వైరల్‌గా మారిందని అక్షయ్ అన్నారు. ‘‘అది ఎఐతో చేసి ఫేక్ వీడియో అలాంటి వాటిని నమ్మకండి. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. కొన్ని టివి ఛానళ్లు ఆ వీడియోలను నిజానిజాలు తెలుసుకోకుండా ప్రసారం చేశాయి. రాసేముందు కనీసం అది నిజమా లేదా మార్ఫింగా అనే విషయం కూడా చూసుకోలేదు. ప్రస్తుతం ఎఐ వీడియోలు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాయి. నిజం కంటే వేగంగా అవే వైరల్ అవుతున్నాయి. ఇది గమనించాలని నా అభ్యర్థన. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాన్ని పరిశీలించాలని కోరుతున్నాను. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని మీడియాను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని అక్షయ్ (Akshay Kumar) ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
Also Read : ప్రేక్షకులను బాగా నవ్వించే సినిమా