ముంబై: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ (Vicky Kaushal) శుభవార్త చెప్పారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఆనందం, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మా జీవితంలోకి సరికొత్త, గొప్ప అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము’’ అంటూ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కొంత సమయంలోనే వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.
కొంతకాలం ప్రేమించుకున్న విక్కీ (Vicky Kaushal), కత్రినాలు 2021లో వివాహ బంధంతో ఒకటయ్యారు. అప్పటి నుంచి కత్రినా తల్లి అవుతుందంటూ చాలాసార్లు వార్తలు వచ్చాయి. కత్రినా వదులుగా దుస్తులు ధరించిన ప్రతీసారి ఆమె తల్లి కాబోతుందని కథనాలు రాశారు. అయితే ఇటీవల కత్రినా బేబీ బంప్‌తో ఓ ఫోటోషూట్ నిర్వహించగా.. ఆ ఫోటోలను ఎవరో లీక్ చేశారు. తాజాగా విక్కీ స్వయంగా తన భార్య గర్భవతి అని వెల్లడించి.. అన్ని పుకార్లకు స్వస్తి పలికాడు.
Also Read : చిరు-పవన్‌ల సినిమా.. ఆర్‌జివి ఆసక్తికర పోస్ట్