దుబాయ్: ఆసియాకప్-2025లో సూపర్-4 మ్యాచ్‌లలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసందే. అయితే ప్రతీ మ్యాచ్ ఓటమి తర్వాత ఏదో ఒక వివాదం తీసుకొచ్చే పాక్‌కు ఈ మ్యాచ్‌లోనూ ఓ సాకు దొరికింది. పాకిస్థాన్ ఆటగాడు ఫకర్ జమాన్.. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్ సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే దీన్ని ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించకుండా.. టివి అంపైర్‌కి రిఫర్ చేశాడు. టివి అంపైర్ బంతి సంజూ వేళ్లపై తాకిందని గుర్తించి దాన్ని ఔట్‌గా ప్రకటించారు. అయితే ఈ వికెప్పై పాకిస్థాన్ మాజీలు (Shahid Afridi) విమర్శలు చేస్తున్నారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ఈ క్యాచ్‌పై వివాదాస్పద కామెంట్‌తో భారత్‌పై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. ‘ఆ అంపైర్ ఐపిఎల్‌లో కూడా అంపైరింగ్ చేయాల్సి ఉంటుంది’ అని ఓ టివి ఛానల్లో అన్నాడు. మరోవైపు మరో మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ మాట్లాడుతూ.. ‘‘కేవలం రెండు కోణాల్లో పరిశీలించి ఔట్‌గా ప్రకటించారు. ఫకర్ జమాన్ అప్పటికే మూడు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లోకి వచ్చాడు. బుమ్రాను మొదటి ఓవర్లో చక్కగా ఎదురుకున్నాడు. అతడి వికెట్ భారత్‌కు చాలా కీలకమైంది’’ అని అన్నాడు.
Also Read : అవకాశాలు మళ్లీ మళ్లీ రావు.. అభిషేక్‌కు సెహ్వాగ్ సూచన