Tuesday, September 23, 2025

‘గ్రూప్‌-1 తీర్పు’పై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌, మార్కుల జాబితాను రద్దు చేస్తూ.. ఇటీవల వెలువడిన తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలైంది. గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి ఒకరు ఈ అప్పీల్‌ను దాఖలు చేశారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అభ్యర్థి అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. టిజిపిఎస్సి (TGSPSC) కూడా అప్పీల్ దాఖలు చేశారని న్యాయవాది పేర్కొనగా.. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

Also Read : ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తా: ఉత్తమ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News