- Advertisement -
న్యూఢిల్లీ: భారత రాజకీయ నాయకులను, పాలకవర్గాన్ని కూడా ప్రభావితం చేయడానికి న్యూఢిల్లీ లోని చైనా రాయబార కార్యాలయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయత్నిస్తోందని టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లొబ్‌సంగ్ సంజయ్ హెచ్చరించారు. ఉన్నతవర్గాలను తమ అదుపులో చేర్చుకోవడం అన్నది చైనా ప్రాచీన వ్యూహంగా ఆయన ఒక ఇంటర్వూలో వెల్లడించారు. “వాళ్లు నాయకులను, మేధావులను, వాణిజ్యవేత్తలను, జర్నలిస్టులను, ఇప్పటి యూట్యూబర్‌లను కూడా కొనుగోలు చేస్తారు. అదే వారు ఏ విధంగా టిబెట్, జిన్‌జియాంగ్,మంగోలియాలో చొరబడ్డారో అదే విధంగా భారత్‌లో కూడా చేస్తారు అని హెచ్చరించారు.
- Advertisement -