Wednesday, September 24, 2025

జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్.. డయానాకు 3 పతకాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయి సిబిఎస్‌ఇ జిమ్నాస్టిక్స్ పోటీల్లో తెలంగాణకు చెందిన డయానా గ్రేస్ స్వర్ణంతో సహా మూడు పతకాలు సాధించి సత్తా చాటింది. మహారాష్ట్ర వేదికగా జరిగిన సిబిఎస్‌ఇ జిమ్నాస్టిక్స్ పోటీల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని కార్నర్ స్టోన్ స్కూల్‌కు చెందిన డయానా మెరుగైన ప్రదర్శనతో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేసింది. టెబుల్ వాల్ట్ విభాగంలో డయానా స్వర్ణం గెలుచుకుంది. అంతేగాక మరో రెండు కాంస్య పతకాలను కూడా డయానా సొంతం చేసుకుంది. ఇక ఇదే పాఠశాలకు చెందిన డయానా సోదరుడు డానియల్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన డయానా, డానియల్‌లను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News