Wednesday, September 24, 2025

‘తెలుసు కదా’ నుంచి సొగసు చూడతరమా…

- Advertisement -
- Advertisement -

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇది సిద్దూ, రాశీ ఖన్నా అలరించిన క్లాసిక్ లవ్ నంబర్. మంగళవారం సిద్దు, శ్రీనిధి శెట్టి నటించిన సెకండ్ సింగిల్ సొగసు చూడతరమా సాంగ్ ను హీరోయిన్ నయనతార లాంచ్ చేశారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ ట్రాక్‌తో తమన్ మరో అద్భుతమైన కంపోజిషన్ అందించాడు. కృష్ణ కాంత్ రాసిన సాహిత్యం అమ్మాయి పట్ల సిద్ధు ఎమోషన్స్‌ని అందంగా చూపించింది. ఈ పాటలో సిద్ధు, శ్రీనిధి మధ్య మెరిసే కెమిస్ట్రీ అదిరిపోయింది. అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News