- Advertisement -
సుప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దివంగత దాశరధి రంగాచార్య సతీమణి కమల (93) మంగళవారం వయోభారంతో కన్నుమూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్నగూడూరు వాస్తవ్యులు అయిన దాశరధి రంగాచార్య జూన్ 7, 2015లో కన్నుమూశారు. ఆయనకు భార్య కమలతో పాటు ముగ్గురు సంతానం. దాశరధి కమల ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు రచయి తలు, సాహితీ అభిమానులు కోరుకున్నారు. ఆమె మరణం సాహిత్య లోకానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. దాశరధి కమల మృతిపట్ల ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ సంతాపం తెలిపారు.
- Advertisement -