Wednesday, September 24, 2025

డాలర్‌తో పోలిస్తే 88.75కి పతనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోయింది. మంగళవారం ట్రేడింగ్‌లో 47 పైసలు క్షీణించి 88.75కి చేరింది. రెండు వారాల క్రితం దాని ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 88.46 కంటే దిగువకు పతనమైంది. ఆసియా మార్కెట్లలో డాలర్ స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో ఈ క్షీణత సంభవించింది. ఆసియా కరెన్సీల బలహీనత, అమెరికా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ తగ్గిందని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు, అమెరికా సుంకాలు, హెచ్1బి వీసా ఫీజు పెంపు కారణంగా రూపాయి విలువ దెబ్బతింటోంది. 2025లో ఇప్పటివరకు రూపాయి 3.25 శాతం బలహీనపడింది. జనవరి 1న డాలర్‌తో పోలిస్తే 85.70 వద్ద ఉన్న రూపాయి ఇప్పుడు 88.49కి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ కొత్త విధానాలు కూడా రూపాయిపై భారం వేస్తున్నాయని కరెన్సీ నిపుణులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News