Wednesday, September 24, 2025

ఆసియాకప్ సూపర్ 4.. లంకపై పాకిస్తాన్ విజయం

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (24), ఫకార్ జమాన్ (17) శుభారంభం అందించానే. హుస్సేన్ తలత్ (32 నాటౌట్), మహ్మద్ నవాజ్(38 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, వానిందు హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. దుష్మంత చమీర ఒక వికెట్ తీశారు.

అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. లంకకు పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షహీన్ అఫ్రిది ముచ్చెమటలు పట్టించాడు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన అఫ్రిది లంక ఓపెనర్లు పాథు మ్ నిసాంకా, కుశాల్ మెండిస్‌లను పెవిలియన్ బాట పట్టించాడు. నిసాంకా (8), మెండిస్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. జట్టు ను ఆదుకుంటారని భావించిన కుశాల్ పెరీరా, కెప్టెన్ చరిత్ అసలంక కూడా నిరాశ పరిచారు. పెరీరా ఒక ఫోర్, మరో సిక్స్‌తో 15 పరుగులు చే సి ఔటయ్యాడు. అసలంక 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 20 పరుగులు చేశాడు. మరోవైపు దాసున్ శన కా(0) సున్నాకే వెనుదిరిగాడు. ఇక ఒంటరి పో రాటం చేసిన కమిందు మెండిస్ లంకకు గౌరవప్రద స్కోరును అందించడంలో కీలక పాత్ర పో షించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కమిందు 44 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగు లు చేసి పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ కూడా ష హీన్ ఖాతాలోకి వెళ్లింది. మిగతా వారిలో హసరంగ (15), కరుణరత్నె 17 (నాటౌట్) కాస్త రాణించారు. పాక్ బౌలర్లలో అఫ్రిది మూడు, రవూఫ్, తలత్ చెరో రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News