Thursday, September 25, 2025

బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియా కప్ 2025 ఫైనల్‌కు భారత్

- Advertisement -
- Advertisement -

దుబాయి: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన ఆసియా కప్ 2025 సూపర్4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఆసియాకప్ ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సైఫ్ హసన్ (69), పర్వేజ్ హుస్సేన్ (21) తప్ప మిగతా వారు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ మూడు, బుమ్రా, వరుణ్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

మెరుపు ఆరంభం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు కళ్లు చెదిరే శుభారంభం అందించారు. గిల్ కాస్త సమన్వయంతో ఆడగా, అభిషేక్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఈ జోడీని కట్టడి చేసేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అభిషేక్ వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. బంగ్లా బౌలర్లపై ఎదురు దాడికి దిగిన అభిషేక్ పరుగుల వరద పారించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను సిక్స్‌లు, ఫోర్లుగా మారుస్తూ ముందుకు సాగాడు. గిల్ కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 2 ఫోర్లు, సిక్స్‌తో 29 పరుగులు చేశాడు. ఇక పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. గిల్ ఔటైన తర్వాత వచ్చిన శివమ్ దూబె (2), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. కొద్ది సేపటికే అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్య 29 బంతుల్లో 38 పరుగులు చేయడంతో భారత్ స్కోరు ఆరు వికెట్లకు 168 పరుగులు చేసింది.

Also Read: టి20లో ర్యాంకింగ్స్‌లో భారత్ హవా..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News