- Advertisement -
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మీతా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవతకవతల వ్యవహారంలో తన ప్రమేయం ఉందంటూ స్పష్టం చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన వివరణ కోరలేదని, విచారణ సందర్భంగా 8బి, 8సి నోటీసులు సైతం ఇవ్వలేదని స్మితా సబర్వాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి హోదాలో పలు సందర్భాల్లో మూడు బ్యారేజిలను స్మితా సబర్వాల్ సందర్శించి ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో ప్రస్తావిస్తూ తప్పు పట్టిన విషయం తెలిసిందే.
- Advertisement -