Tuesday, May 21, 2024

రోడ్డుపై చెత్త వేసినందుకు రూ.పదివేల జరిమాన

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చెత్తను రోడ్డుపై వేసిన వ్యాపారికి మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య రూ. పదివేలు జరిమాన విధించారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో పారిశుధ్య పర్యవేక్షణ చేస్తున్న కమిషనర్‌కు మానేరు వంతెన వద్ద పెద్ద మొత్తంలో చెత్తను వేయడం గమనించి బాధ్యులు ఎవరని ఆరాతీయగా గాంధీ చౌక్ ప్రాంతంలోని కావ్య బెంగుళూరు బేకరి వారు చెత్త వేశారని తేలడంతో కమిషనర్ దుకాణ యజమానిని పిలిపించి చెత్త బహిరంగ ప్రదేశంలో వేసినందుకు రూ. పదివేలు జరిమాన విధించారు.

మరోసారి అలా చేయకూడదని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఏర్పాటు చేసిన ట్విన్‌బిన్స్‌లో మాత్రమే చెత్తను వేయాలన్నారు. బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే ఉపేక్షించమన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్‌పెక్టర్ బీమనపెల్లి సత్యనారాయణ, సానిటరీ జవాన్ ఉమర్, హెల్త్ అసిస్టెంట్ సుకుమార్ జవాన్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News