Tuesday, April 30, 2024

హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -
  • పల్సర్ బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం

హసన్‌పర్తి: హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ కథనం ప్రకారం.. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ సెంట్రల్ జోన్ ఎంఏ భారీ పర్యవేక్షణలో కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజ్ నేతృత్వంలో హసన్‌పర్తి సీఐ తుమ్మ గోపి ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిక్క యశ్వంత్, జమ్మికుంట మండలం శాయంపేట గ్రామానికి చెందిన డి. అంజి, హన్మకొండ బాలసముద్రం చెందిన కుమ్మరి రాజేష్‌లు మూడు నెలల నుంచి హైవేపై తిరుగుతున్న లారీలను ఆపి నిద్రిస్తున్న వారిపై విచక్షణా రహితంగా దాడిచేసి వారి నుంచి నగదు, సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. కాగా హసన్‌పర్తి చెరువు కట్ట వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద నిద్రిస్తున్న సిబ్బంది దగ్గర నుంచి పడుకున్నపుడు వారి జేబు కట్‌చేసి మొబైల్ దొంగతనం చేశారు.

కాగా వారు వెంటనే హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబరు 322/2023 కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. కాగా రెండు నెలల క్రితం కోమటిపల్లి టోల్ ప్లాజా దగ్గర నిద్రిస్నుత్న ఒక లారీలోకి వీరు అక్రమంగా ప్రవేశించి అద్దం కట్‌చేసి అందులో డ్రైవర్ జేబు కట్‌చేసే క్రమంలో డ్రైవర్ లేవడంతో వెంటనే అతడిని చేతులతో దాడిచేసి రాళ్లతో కొట్టి అక్కడ నుంచి పరారయ్యారు.

డ్రైవర్ దగ్గర నుంచి రూ. 35 వేల నగదు, ఒక స్మార్ట్ ఫోన్ దొంగలించారు. మరో సంఘటనలో టోల్‌గేట్ ఓఆర్‌ఆర్‌ఎస్ బ్రిడ్జి పైన ఇంకొక లారీని ఆపి అతనిని కొట్టి అతని వద్ద నుంచి స్మార్ట్ ఫోన్, రూ. 30 వేలు నగదు దొంగిలించారు. నిందితుల వివరాల ప్రకారం.. రాత్రివేళలలో 180 సీసీ పల్సర్ వాహనం టీఎన్10ఏడీ 4753తో గస్తీ తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి వ్యక్తులపై దాడిచేసి వారి నుంచి నగదు, మొబైల్స్ దొంగలించి ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై విచక్షణా రహితంగా దాడి చేసేవారు. కాగా దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కాజీపేట సబ్ డివిజన్ ఏసీపీ డేవిడ్‌రాజ్ నేతృత్వంలోని హసన్‌పర్తి సీఐ తుమ్మ గోపి, ఎస్సై రాజు, ఏఏఓ సల్మాన్‌పాషా, ఐటీ కోర్ టీమ్ నగేష్, క్రైం కానిస్టేబుళ్లు క్రాంతికుమార్, మధులను ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News