Thursday, May 2, 2024

వీలిన గ్రామాల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి/సుబేదారి:నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలు, కాలనీల అభివృ ద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్‌లోని పరిమళ కాలనీలో రూ. 85 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు, సైడు డ్రైన్లు, సప్తగిరి కాలనీ రోడ్డు నెం. 8లో రూ. 25 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు, రోడ్ నెం. 9లో రూ. 30 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులు, పరిమళ కాలనీలో రూ. 85 లక్షలతో ఏర్పాటుచేసిన పార్కును ప్రారంభించారు.

అనంతరం ఆర్టీసీ కాలనీలో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు భవన నిర్మాణానికి భూమి పూజచేసి ప్రొసీడింగ్ కాపీని అందచేశారు. మొత్తం రూ. 2.25 కోట్లతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలు, కాలనీల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతీ గడపకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్, డివిజన్ ప్రెసిడెంటు మణింద్రనాథ్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News