Sunday, May 5, 2024

ఎల్గార్ పరిషద్ కేసులో నిందితురాలు విడుదల

- Advertisement -
- Advertisement -

Accused Sudha Bharadwaj released from jail

ముంబయి: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఎల్గార్ పరిషద్ కేసులో నిందితురాలు, కార్యకర్త సుధా భరద్వాజ్ ఇక్కడ బెయిల్‌పై గురువారం జైలు నుంచి విడుదల అయ్యారు. బాంబే హైకోర్టు డిసెంబర్ 1న సుధా భరద్వాజ్‌కు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆమెపై ఎలాంటి షరతులు పెట్టాలన్నది ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు నిర్ణయించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. స్పెషల్ ఎన్‌ఐఎ కోర్టు సుధా భరద్వాజ్‌ను రూ. 50000 బాండ్‌పై విడుదలచేయాల్సిందిగా బుధవారం ఆదేశించింది. లాంఛనాలన్నీ ముగిశాక బైకుల్లా మహిళల కారాగారం నుంచి గురువారం మధ్యాహ్నం విడుదలచేశారు. జైలు బయట ఆమె వెయిటింగ్ కారులో కూర్చున్నాక మీడియా వ్యక్తులకు చేయూపారు. సుధా భరద్వాజ్‌ను 208 ఆగస్టులో ‘ఉపా చట్టం’ కింద అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News