Saturday, April 27, 2024

నటుడు చంద్రమోహన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
ఎందరో నటులకు స్ఫూర్తి : కెసిఆర్
ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన ఆయ న అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు.

చంద్రమోహన్ 1966లో వచ్చిన ’రంగుల రాట్నం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా, కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 900లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. ఆయన తమిళ సినిమాల్లోనూ నటించారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు ద క్కాయి. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో  ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అందుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News