Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్ కనిపించే దేవుడు

- Advertisement -
- Advertisement -

KCR UTTEJ

 

ఆయన సల్లంగా ఉండాలి
‘కెసిఆర్ సర్ నిన్ను నాయినా అని పిలవాలని ఉందే పిలవనా’
వీడియో విడుదల చేసిన నటుడు ఉత్తేజ్
సిఎంపై ప్రశంసల జల్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : కొండంత అండగా, నిలువెత్తు మానవత్వంతో మనందరికోసం, మనకోసం నడుస్తున్న కెసిఆర్ సర్… నిన్ను నాయినా అని పిలవాలని ఉందే.. పిలవనా? అంటూ నటుడు ఉత్తేజ్ తన వీడియోలో పేర్కొన్నారు. ఆపై తన ప్రసంగంలో అప్పుడెప్పుడో ఎనకట శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమెత్తినట్టు, ప్రజల ఆకలి, అప్పుల బాధలను తీర్చేందుకు పేదోళ్ల పాలిట పరమాత్ముడిలా కెసిఆర్ నిలిచారని ఉత్తేజ్ ప్రశంసలు కురిపించారు. కెసిఆర్ తమకు కనిపించే దేవుడని, నువ్వు సల్లగుండాలని ఉత్తేజ్ తన వీడియోలో పేర్కొన్నారు.

భయం అన్నది ఆమడదూరంలో ఉన్నా…జయిస్తాం
మన ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు, అలుపు లేకుండా ప్రజాశ్రేయస్సే పరమావరిధిగా, తన పరిపాల దక్షతతో సరైన నిర్ణయాలతో తెలంగాణ గడ్డ మీదున్న ప్రతీ ఒక్కరినీ కాపాడే దిశగా ప్రయత్నిస్తున్నారని ఉత్తేజ్ పేర్కొన్నారు. మొన్న టివిలో నిన్ను చూసినంక, నీ మాటలు ఇన్నంకా, నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు, మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పినట్టు మా ఇంట్లో మనిషివైనట్టు కొట్టిందే… అందుకే ‘నిన్ను నాయినా అని పిలవాలని ఉంది, పిలవనా నాయినా?’ మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు ఆల్లు, ఈల్లని కాదు మొత్తం అందరం ఊపిరి పీల్చుకున్నరు. పానాలు లేచివచ్చినయ్ అన్నరు. తెలంగాణ వెన్నుపూసగ నిలిచినావ్. గుండె దమ్మువై నడుస్తున్నవే. మా బాగోగులు పట్టించుకుంటున్నవ్. నిన్ను చూసినా, నీ మాటలిన్నా బ్రతుకుమీద నమ్మకం వస్తుంది. భయం అన్నది ఆమడదూరంలో ఉన్నా, అయినా జయిస్తాం అనిపిస్తది అంటూ ఉత్తేజ్ తన వీడియోలో పేర్కొన్నారు.

ఇరుగు, పోరుగోళ్లకు ఆదర్శమైతివి
అందరు సల్లగుండాలే, మనుషులు పోతే వస్తరా అని మానవ వనరులు విలువ చెప్తోంది. తెలంగాణ బిడ్డలే కాదు, ఈ గడ్డమీద ఉన్న ఏ బిడ్డ కూడా ఉపాసం ఉండొద్దని అమ్మలెక్క అర్సుకున్నవ్. ఆఫీసర్లకి ఆర్డర్లిస్తుంటివి. ఆపన్నులను ఆదుకుంటుంటివి. అనాథల అక్కున చేర్చుకుంటివి. గీ కరోనాని తరుముకుంటూ పానాలు నిలుపుతుంటివి. ప్రధానమంత్రి అంటే దేశానికే బడిలెక్కన, మంచి మాట ఎవరన్నా వినాలని, మంచిబాట ఎవ్వరూ చూపినా నడవాలని, ప్రమాదంల పార్టీని చూడొద్దని, మానవత్వం నేర్పిస్తుంటివి, మానవజన్మ పునరుద్ధరిస్తుంటివి. ఇరుగు, పోరుగోళ్లకు ఆదర్శమైతివి అంటూ ఉత్తేజ్ ఓ సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశారు.

 

Actor Uttej praise on CM KCR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News