Tuesday, May 14, 2024

సవాల్ తో కూడిన పాత్ర చేయడం ఆనందాన్నిచ్చింది

- Advertisement -
- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రగతి శ్రీవాస్తవ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “పెదకాపు కథను దర్శకుడు శ్రీకాంత్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకూ మంచి సస్పెన్స్‌తో చాలా క్యాచీగా అనిపించింది. ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా వుంటుంది.

నా పాత్రే కాదు ఇందులో వుండే దాదాపు పాత్రలన్నీ కథలో చాలా కీలకంగా వుంటాయి. ఒక నటిగా ఇప్పుడే అడుగులు వేస్తున్నాను. ఇలాంటి సవాల్ తో కూడిన పాత్ర చేయడం ఒక నటిగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా పాత్రలో అన్ని ఎమోషన్స్ వున్నాయి. విరాట్ కర్ణ చాలా సపోర్టివ్ కోస్టార్. ఈ సినిమాలో తన పాత్ర ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆ పాత్రలో అందరూ కనెక్ట్ అవుతారు. ఇక ప్రస్తుతం ‘గంగం గణేశా’ చేస్తున్నా. అలాగే ఇంకొన్ని కథలు వింటున్నాను” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News