Tuesday, April 30, 2024

మార్కెట్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్.. క్వింటాళ్ల కొద్దీ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను విక్రయిస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని ఉప్పర్ పల్లిలో డక్కన్ ట్రేడర్స్ పేరిట ఈ ముఠా కల్తీ వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తోంది. ఈ సరకును పాటిగడ్డలో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ముఠాకు చెందిన నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, 700 కిలోల నకిలీ పేస్ట్ ను, 625 కేజీల వెల్లుల్లిని, 100 కిలోల అల్లంను, కొన్ని రకాల రసాయనిక పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

గుజరాత్ కు చెందిన రహీం అనే వ్యక్తి అక్రమ తయారీ యూనిట్ ను నెలకొల్పి, పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరు ఈ నకిలీ సరకును ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News