Sunday, April 28, 2024

మహిళపై మూత్రవిసర్జన కేసు… అతడు దేశం వదిలి వెళ్లొద్దు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిర్ ఇండియా విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జనచేసిన ప్రయాణికుడిపై లుక్ అవుట్ సర్కులర్(ఎల్‌ఓసి) జారీఅయింది. ఇప్పటివరకు నలుగురు విమాన సిబ్బంది మాత్రమే దర్యాప్తులో పాల్గొన్నారని, మిగిలిన సిబ్బంది నేడు పాల్గొంటున్నారని పోలీసులు తెలిపారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఎల్‌ఓసి జారీ చేయవలసిందిగా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌ను కోరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి అనేక బృందాలను ముంబైకి పంపినట్లు వారు చెప్పారు. ఎయిర్ ఇండియాకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చే విమానంలో మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు తన తోటి ప్రయాణికురాలైన ఒక 70వ దశకంలో ఉన్న వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. నిందితుడిని శంకర్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. అతను క్యాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికన్ మలీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన భారతదేశ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా నచిచేస్తున్నాడు. ముంబైలో నివసిస్తున్న మిశ్రా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని ఆచూకీ కోసం అనేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News