Sunday, April 28, 2024

విద్యావ్యవస్థలో ఎఐని భాగం చేయాలి: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: విద్యావ్యవస్థలో ఎఐని భాగం చేయాల్సిన అవసరం ఉందని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులు, విసిలతో సిఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు, బోధన,. నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సిఎం జగన్ కీలక దృష్టి పెట్టారు. ఎఐ, వర్చువల్ రియాల్టీ, అగ్‌మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి సారించాలని జగన్ సూచించారు. ఎఐ, వర్చువల్, అగ్‌మెంటేషన్ రియాల్టీ రంగాల్లో విద్యార్థులను క్రియేటర్లుగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని సూచించారు. రాబోయే రోజుల ఎఐ టెక్నాలజీ ద్వారా విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తుందన్నారు. అగ్‌మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు.

Also Read: అద్భుతమైన క్యాచ్ పట్టిన సిరాజ్… వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News