Thursday, May 2, 2024

తేజస్ యుద్ధ విమానాన్ని నడిపిన ఎయిర్‌ చీఫ్

- Advertisement -
- Advertisement -

R-K-S-Bhadauria

కోయంబత్తూర్ : భారత వైమానిక దళాధిపతి, ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్‌ఎఎస్ భదౌరియా బుధవారం ఎంకె 1 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాన్ని కాసేపు నడిపారు. తమిళనాడు లోని సూలూరు ఎయిర్ స్టేషన్‌లో ఈ విమానాన్ని ఆయన పరిశీలించారు. తేజస్ జెట్ విమానం అభివృద్ధి బృందంతో కలసి ఆయన పనిచేశారని అధికార వర్గాలు తెలిపాయి. నాలుగో తరం విమానాల్లో ఇది చిన్నది, తేలికపాటిదని, ఈ విమానాలను ఫ్లైయింగ్ బులెట్లుగా పిలుస్తారని వివరించాయి. ఎయిరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హెచ్‌ఎఎల్ ఈ తేజస్ విమానాలను అభివృద్ధి చేశాయి. వీటి జీవితకాలం 30 సంవత్సరాలు. భారత వైమానిక దళం 40 తేజస్ విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. మరో 83 విమానాల కోసం రూ.38,000 కోట్లతో త్వరలో హెచ్‌ఎఎల్‌తో ఒప్పందం కుదర్చుకోనున్నది.

Air Marshal Marshall who flew the Tejas fighter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News