Friday, May 3, 2024

పవర్‌ఫుల్‌గా ఆకాష్ పూరీ

- Advertisement -
- Advertisement -

Akash puri act in chor bazar

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. హీరోయిన్‌గా గెహన సిప్పీ నటిస్తోంది. దళం, జార్జ్‌రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఆదివారం ఈ రోజు హీరో ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విదుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్‌గా ఉంది. హీరో ఆకాష్ పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్‌లో శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News