Friday, May 17, 2024

రైడర్ పునఃప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రైడర్’. కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని చంద్ర మనోహరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రైడర్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. కాగా ఆదివారం నుండి ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో దత్తన్న, అచ్యుత కుమార్, రాజేష్ నటరంగ, శోభరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News