Wednesday, November 6, 2024

కిడ్నాప్… అఖిల ప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

Akhil Priya arrest over Bowenpally kidnap case

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. కిడ్నాప్ కేసులో ఎపి మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలో అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకొని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. కిడ్నాప్ కేసులో ఆమెను పోలీసులు విచారించనున్నారు. అఖిల ప్రియ భర్త ప్రస్తుతం భర్గవ రామ్ అందుబాటులో లేడు. మంగళవారం రాత్రి బోయిన్‌పల్లిలో సిఎం కెసిఆర్ బంధువులు ముగ్గురిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావుతో అతడి ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు ముగ్గురిని నార్సింగిలో వదిలి పారిపోయారు. కిడ్నాప్‌కు భూవివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News