Wednesday, May 15, 2024

వైజాగ్ పోర్ట్‌లో యాక్షన్ ఎపిసోడ్స్

- Advertisement -
- Advertisement -

అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరించనున్నారు. షూటింగ్‌లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్‌కు ఎయిర్ పోర్ట్‌లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

అఖిల్ ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ బైక్ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. అభిమానులు నుంచి వచ్చిన ఈ భారీ స్పందన అఖిల్‌కి వున్న క్రేజుకి అద్దం పడుతుంది. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఏజెంట్‌గా అఖిల్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచుతుంది. తాజాగా అఖిల్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన పోస్టర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ కథ అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News