Tuesday, April 30, 2024

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కు అలియాభ‌ట్..

- Advertisement -
- Advertisement -

దర్శకధీరడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ‌ ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణె, మహబలేశ్వర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ ల కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా, ఈ షెడ్యూల్ లోనే బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్ మూవీ టీంతో కలువనున్నట్లు వార్తలు వచ్చాయి. అందరూ ఊహించినట్లే అలియా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బయల్దేరి వెళ్లింది. ఆదివారం ఉద‌యం ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్పాట్ కు పయనమైన అలియాభట్.. ‘ఫైన‌ల్ గా ఆర్ఆర్ఆర్ బృందం దారిలో’ అని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కామెంట్ పెట్టింది. షూటింగ్ కు వెళ్లేందుకు కారులో ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న అలియాభట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Alia Bhatt Final Joins RRR Team for Shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News