Thursday, May 2, 2024

సిఎం కెసిఆర్ నేతృత్వంలో అన్ని మతాలకు ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అన్ని మతాలకు తగు ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా బిజినేపల్లి మండలంలోని పాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘనందన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్ని మండలాలకు సంబంధించి 22 దేవాలయాలకు దూప దీప నైవేద్యం అర్చకులకు ఆర్డర్ కాపీలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ అని మతాలకు తగు ప్రాధాన్యత ఇస్తున్నారని, దూపదీప నైవేద్యం 6 వేల నుంచి పది వేలకు పెంచడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ రాక ముందు దేవాలయాలు ఎలా ఉండేవి నేడు ఎలా ఉన్నా యో గమనించాలన్నారు. అంతకు ముం దు కొటాలగడ్డ గ్రామంలో ఇటీవల బొ డ్రాయిని ప్రతిష్టించిన సందర్భంగా బొ డ్రాయి దేవతను ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News