Thursday, May 2, 2024

మా విడాకులకు అతను కారణం కాదు

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ అమలా పాల్ విడాకులు తీసుకొని చాలా కాలమైనా కూడా ఇంకా అదే విషయం మీడియాలో నానుతూనే ఉంది. అమలా పాల్, ఆమె భర్త విజయ్‌ల మధ్య గొడవ రావడానికి కారణం ఒక తమిళ హీరో అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ తమిళ హీరో ఎవరో విజయ్ తండ్రి క్లారిటీ ఇచ్చాడు. ధనుష్ వల్లే తన కొడుకు, అమలాపాల్ విడిపోయారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలనుకున్న ఆమెతో ధనుష్ మళ్లీ నటింపజేయడం వల్లే వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైందని చెప్పాడు.

సినిమా వల్ల ప్రారంభమైన గొడవలు విడాకుల వరకు దారి తీసిందంటూ ఆయన పేర్కొన్నాడు. అమలా పాల్‌ను ఇదే విషయమై స్పందించాల్సిందిగా కోరగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్య భర్తల విడాకులకు మరెవరో కారణం కాలేరు అని పేర్కొంది. అంటే తమ విడాకులకు ధనుష్‌తో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. మా ఇద్దరి కారణంగానే మేము విడిపోయాం తప్ప మరెవరి కారణంగానో మేము విడిపోలేదని అమలాపాల్ చెప్పింది. ఇక రెండవ పెళ్లి గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదని.. చేసుకోవాలనిపించినప్పుడు తప్పకుండా చెబుతానని పేర్కొంది. ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదిర్చినదా అనేది కూడా నేను ఇంకా నిర్ణయించుకోలేదని అమలాపాల్ తెలిపింది.

Amala Paul defends dhanush in her divorce with AL Vijay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News