Thursday, May 2, 2024

బిజెపితో కెప్టెన్ దోస్తీ

- Advertisement -
- Advertisement -

Amarinder Singh Ties Up With BJP

పంజాబ్‌లో విజయం మాదేనని అమరీందర్ ధీమా

న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌తో తన సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి చెప్పి సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా బిజెపి అగ్రనేతలతో వరస భేటీలు జరుపుతున్న అమరీందర్ .. ఈ ఎన్నికల్లో కమలనాథులతో కలిసి అధికారాన్ని దక్కించుకుంటామని ప్రకటిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇరుపార్టీల మధ్య అధికారికంగా పొత్తు ఖరారయింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పంజాబ్ బిజెపి ఇన్‌చార్జి గజేంద్ర సింగ్ షెకావత్‌తో అమరీందర్ ఢిల్లీలో సమావేశమయ్యారు.

అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. తమ పొత్తు ఖరారయిందని, ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపకంపై తదుపరి చర్చలు జరుగుతాయని, గెలుపు అవకాశం ఉన్న సీట్లవారీగా కేటాయింపులు జరుగుతాయని తెలిపారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో 101 శాతం విజయం తమదేనంటూ కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపితో పొత్తు కుదిరిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కెప్టెన్ అమరిందర్ గజేంద్ర సింగ్ షెకావత్‌ను అలింగనం చేసుకున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు. కొన్ని దశాబ్దాల పాటు పంజాబ్‌లో అకాలీదళ్ జూనియర్ భాగస్వామిగా కొనసాగుతూ వచ్చిన బిజెపి ఈ సారి అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకోవడం గమనార్హం. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో అమరీందర్ సింగ్ స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్‌కన్నా ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News