Wednesday, May 1, 2024

భారత్ కోరితే మరిన్ని రాఫెల్స్ అందిస్తాం

- Advertisement -
- Advertisement -
France ready to provide more Rafales to India
ఫ్రాన్స్ రక్షణ మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ: భారత్‌కు అవసరమయితే తమ దేశం మరిన్ని రాఫెల్ జెట్ విమానాలను అందజేయడానికి సిద్ధంగా ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్‌స పార్లే శుక్రవారం చెప్పారు. అంతే కాదు తమ రెండు దేశాలు ఒకే విమానాన్ని ఉపయోగించడం తమ సంబంధాల నిజమైన శక్తిని ప్రతిబింబిస్తుందని కూడా ఆమె అన్నారు. భారత్‌లో పర్యటన కోసం వచ్చిన ఆమె రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విస్తృతస్థాయి చర్చలకు ముందు ఓ చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కొవిడ్ మహమ్మారి విజృంభణ ఉన్నప్పటికీ భారత్‌కు 33 రాఫెల్ యుద్ధ విమానాలను ఇదివరకే అందజేయడం జరిగిందని మన దేశంలో ఫ్రాన్స్ దౌత్య కార్యాలయం గురువారం తెలియజేసింది. 36 రాఫెల్ యుద్ధ విమానాలను రూ.59,000 కోట్లతో కొనుగోలు చేయడానికి మన దేశం 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

‘రాఫెల్ యుద్ధ విమానాల పట్ల భారత వైమానిక దళం సంతృప్తిగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. కొవిడ్ మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ 36 విమానాలను ఒప్పందం ప్రకారం సకాలంలో డెలివరీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నిజంగా గొప్ప విజయం’ అని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాదు, కొత్త పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు. భారత్ త్వరలోనే రెండో విమాన వాహక నౌకను చేర్చుకోవాలని అనుకొంటోందన్న వార్తలను ఆమె ప్రస్తావిస్తూ, భారత్ గనుక కోరితే మరిన్ని విమానాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. భారత్‌కు మరో 36 రాఫెల్ యుద్ధ విమానాల సరఫరాకోసం చర్చలు ప్రారంభించాలని ఫ్రాన్స్ ఆత్రుతతో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News