Monday, April 29, 2024

భారతీయ విద్యార్థులకు మాక్రాన్ కానుక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్యాన్యుయెల్ మాక్రాన్ తమ దేశంలో మరింత మంది భారతీయి విద్యార్థులు చదువుకునేలా చూసేందుకు శుక్రవారం కొన్ని చర్యలు ప్రకటించారు. 2030 నాటికల్లా 30 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులను చేర్చుకోవాలని ఫ్రాన్స్ ఆశావహమైన లక్షం పెట్టుకుందని మాక్రాన్ వెల్లడించారు. ‘2030 నాటికి ఫ్రాన్స్‌లో 30 వేల మంది భారతీయ వివ్యార్థులు ఉంటారు. అది ఎంతో ఆశావహమైన లక్షమే. కానీ అది సాకారం అయ్యేలా చూస్తాను’ అని మాక్రాన్ ‘ఎక్స్’లో వాగ్దానం చేశారు.

విద్యార్థులకు ఫ్రాన్స్ ఏవిధంగా సాయం చేస్తుందో మాక్రాన్ విశదీకరిస్తూ, తమ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యయానికి ఫ్రెంచ్ భాష మాట్లాడలేని విద్యార్థులను అనుమతించేందుకు అంతర్జాతీయ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘అలయన్సెస్ ఫ్రాంయైజెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫ్రెంచ్ భాష మాట్లాడలేని విద్యార్థులను మా విశ్వవిద్యాలయాల్లో చేరేలా చూసేందుకు అంతర్జాతీయ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆయన తెలియజేశారు. ‘కానీ దీనితోనే ముగియలేదు. ఫ్రాన్స్‌లో చదువుకున్న పూర్వపు భారతీయ విద్యార్థులు ఎవరికైనా వీసా ప్రక్రియకు మేము వీలు కల్పిస్తాం’ అని మాక్రాన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News