Tuesday, May 7, 2024

తబ్లీగ్ ఎఫెక్ట్: అమెరికన్లు, చైనీయుల వీసాలు కట్

- Advertisement -
- Advertisement -

visas

 

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిన వారిలో నలుగురు అమెరికన్లు, తొమ్మండుగురు బ్రిటిష్‌వారు, ఆరుగురు చైనావారు కూడా ఉన్నారు. తబ్లీగ్ సదస్సుకు హాజరైన 960 మంది విదేశీయుల వీసాను కేంద్ర హోం మంత్రిత్వశాఖ రద్దు చేసింది. వీరంతా టూరిస్టు వీసాలపై వచ్చి మతసభలలో పాల్గొన్నట్లు నిర్థారణ అయింది. దీనితో వీరిపై వేటు వేశారు. విదేశాలకు చెందిన ఈ జమాత్ సభ్యులలో ఏఏ దేశస్తులు ఎందరు ఉన్నారనేది ఇప్పుడు నిర్థారించారు. ఈ క్రమంలో వీరిలో అమెరికా, బ్రిటన్, చైనాకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది. జమాత్ సభ్యులైన విదేశీయులు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నారు. వీరిలో దాదాపు 300 మందికి కోవిడ్ 19 సోకినట్లు నిర్థారణ అయింది.

విదేశీయులైన జమాత్ సభ్యులలో 379 మంది ఇండోనేషియన్లు, 110 మంది బంగ్లాదేశీయులు, 63 మంది మయన్మారీలు, 33 మంది శ్రీలంక జాతీయులు, 77 మంది కిర్గిస్తాన్, 75 మంది మలేసియా, 65 మంది థాయ్, 12 మంది వియత్నాం, తొమ్మండుగురు సౌదీ, ముగ్గురు ఫ్రాన్స్ వారు ఉన్నట్లు వెల్లడైంది. వీరిందరిని బ్లాక్‌లిస్టులో పెట్టారు. వీరి వీసాలను రద్దు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో గత నెలలో జరిగిన జమాత్ సభలకు కనీసం 9వేల మంది హాజరయ్యారు. ఆ తరువాత వీరు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో దేశంలోని వేర్వేరు చోట్ల వైరస్ వ్యాప్తి జరిగిందనే విషయం ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆందోళనకర పరిణామం అయింది. ఇప్పటికీ పలువురిని గుర్తించే పనిలో ఉన్నారు. పలు క్వారంటైన్ సెంటర్లలో కొందరిని ఉంచి చికిత్స జరుపుతున్నారు.

 

Americans and Chinese visas in block list
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News