Tuesday, April 30, 2024

అనుమానస్పదంగా యాంకర్ శాంతి మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బుల్లితెర నటి శాంతి అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలో శాంతి చనిపోవడంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాంతిని ఎవరైనా చంపారా లేక నిద్ర మాత్రలు తీసుకొని ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఇంటికి సమీపంలో ఉన్న సిసి కెమెరాలతోపాటు ఆమె ఫోన్ కాల్ లిస్టును పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News