Saturday, May 4, 2024

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఆరిజెన్ ఫార్మా సంస్థ హైద్రాబాద్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో మంగళవారం ఆరిజెన్ ఫార్మా సంస్థ ప్రతినిధుల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆరిజెన్ ఫార్మా సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో ఈ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ ఉన్న జీనోమ్ వ్యాలీకి ఆరిజెన్ ఫార్మాను ఆయన స్వాగతిం చారు.

ఈ ఫార్మా సంస్థ్ జీనోమ్ వ్యాలీలో 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 250 మందికి పైగా ఉపాధి కల్పించనుంది. ప్రపంచ స్థాయి ప్రమా ణాలతో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది. ఆరిజెన్ ఫార్మా సంస్థ నిర్ణయంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి బయోఫార్మాస్యూటికల్ పరిశోధన, ఉత్పత్తికి ఎంతో దోహదపడుతుందని, హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో మరింత గణనీయమైన పురోగతిని కొనసాగిస్తామనే నమ్మకం కలిగిందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ సందర్భంగా అరిజెన్ ఫార్మా ప్రతినిధులను మంత్రి కెటిఆర్ అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News