Tuesday, May 7, 2024

భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో కొత్త రైలు

- Advertisement -
- Advertisement -

Another new train between India and Bangladesh

న్యూ జల్పాయ్‌గురి(ప.బెంగాల్): భారత్, బంగ్లాదేశ్ మధ్య రైలు ప్రయాణం ప్రారంభమైంది. న్యూజల్పాయ్‌గురి-ఢాకా మిటాలి ఎక్స్‌ప్రెస్ రైలును రెండు దేశాల రైల్వే మంత్రులు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. కొత్త రైలు పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైనట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య రెండు రైళ్లు నడుస్తున్నాయి. కోల్‌కత-ఢాకా మధ్య మైత్రీ ఎక్స్‌ప్రెస్, కోల్‌కత-ఖుల్నా మధ్య బంధన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. బుధవారం ఉదయం 9.20 గంటలకు ఢిల్లీ నుంచి భారత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బంగ్లాదేశ్ రైల్వే మంత్రి మొహమ్మద్ నూరుల్ ఇస్లామ్ సుజన్ వర్చువల్‌గా మిటాలి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించినట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి సవ్యసాచి దే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News