Saturday, April 27, 2024

గవాస్కర్‌పై అనుష్క ఫైర్..

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ స్పందించారు. తనపై గవాస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా గవాస్కర్‌ను కడిగి పారేశారు. కాగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా వ్యాఖ్యతగా వ్యవహరించిన గవాస్కర్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి అనుచిత కామెంట్ చేశాడు. లాక్‌డౌన్ సమయంలో కోహ్లి తన భార్య అనుష్క బౌలింగ్‌లో మాత్రమే ప్రాక్టీస్ చేశాడని, అందుకే ఐపిఎల్‌లో సరిగ్గా రాణించలేక పోతున్నాడని పేర్కొన్నాడు. ఇదిలావుండగా కోహ్లి వైఫల్యాల గురించి మాట్లాడుతూ.. తన పేరును ప్రస్తావించడాన్ని అనుష్క శర్మ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు గవాస్కర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటైన లేఖను రాశారు. మీరంటే నాకు ఎంతో గౌరవం. భారత దిగ్గజ క్రికెటర్‌గా మిమ్మల్ని మేమిద్దరం ఎంతో గౌరవిస్తాం. ఇక క్రికెటర్ల వైఫల్యాల గురించి మీరు చేసే విశ్లేషణలు బాగానే ఉంటాయి. ఇతర క్రికెటర్లపై విమర్శలు చేసినప్పుడు ఎప్పుడూ కూడా వారి భార్యల ప్రస్తావన మీరు తేలేదు. కానీ విరాట్ గురించి మాట్లాడినప్పుడూ.. తన పేరును ప్రస్తావించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతో బాధకు గురి చేసింది. దీనిపై మీరు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ అనుష్క తన లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా పలువురు నెటిజన్లు ఈ విషయంలో అనుష్కకు అండగా నిలిచారు. గవాస్కర్ ఇలాంటి అనుచిత కామెంట్ చేయకుండా ఉండాల్సిందని వారు పేర్కొన్నారు.
సన్నీ వివరణ
మరోవైపు దీనిపై గవాస్కర్ స్పందించాడు. తాను అనుష్కను కించ పరిచే విధంగా కామెంట్లు చేయలేదని స్పష్టం చేశాడు. తన వ్యాఖ్యలను అనుష్క మరో విధంగా అర్థం చేసుకుని ఉండొచ్చని పేర్కొన్నాడు. కేవలం కోహ్లి బ్యాటింగ్ వైఫల్యం గురించి మాత్రమే తాను మాట్లాడానని, అంతేతప్ప అతను భార్య ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదని వివరించాడు. ఒకవేళ తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని గవాస్కర్ కోరాడు.

Anushka Sharma fires on Sunil Gavaskar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News