Sunday, April 28, 2024

జలాల మళ్లింపుపై ఎపి వాదన నిరాధారం

- Advertisement -
- Advertisement -

AP Argument on water diversion is baseless

దానిని పట్టించుకోవద్దు, టెలిమెట్రీ అవసరం లేదు కెఆర్‌ఎంబికి తెలంగాణ లేఖ
కృష్ణ పరిధిలో ఆ నదీ
జలాలను అందించలేని
ప్రాంతాలకు మాత్రమే గోదావరి
నీటిని మళ్లిస్తున్నాం
అందుకోసమే శ్రీరాంసాగర్
మొదటి,రెండవ దశలు
ఎపి గోదావరి నుంచి కృష్ణకు
మళ్లిస్తున్న మేరకు మిగులు నీటిని
ఎగువ ప్రాజెక్టులకు తెలంగాణ
వినియోగించుకోవచ్చు
లేఖలో స్పష్టం చేసిన
తెలంగాణ ఇఎన్‌సి మురళీధర్

మనతెలంగాణ/ హైదరాబాద్: కృష్ణా బేసిన్‌కు తెలంగాణ రాష్ట్రం మళ్లిస్తున్న గోదావరి నదీజలాలను లెక్కించేందుకు టెలిమెట్రీలు ఏర్పాటు చేసి ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ర్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీయాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. కృష్ణాబేసిన్‌కు తెలంగాణ మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని , ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పరిగణలోకి తీసుకోవాలని ఎపి గతంలో కృష్ణారివర్ బోర్డుకు లేఖ రాసింది. దీనిపై వివరణ ఇస్తూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం నాడు కృష్ణారివర్ బోర్డుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదన నిరాధారమైనదని, ఎంతమాత్రం సహేతుకం కాని ఎపి డిమాండ్‌ను పట్టించుకోవాల్సిన బోర్డు పట్టించుకోవాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు.

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్‌ను ప్రాజెక్టును పట్టించుకోలేదు:

ఇప్పటివరకూ కృష్ణరివవర్ బేసిన్ పరిధిలో కృష్ణానదీజలాలను అందించలేని ప్రాంతాలకు మాత్రమే గోదావరి నదీజలాలను మళ్లిస్తున్నట్టు ఈఎన్సీ మరళీధర్ లేఖలో పేర్కొన్నారు. ఎపి ప్రస్తావించిన ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో చేపట్టిన ప్రాజెక్టులే అని తెలిపారు. తెలంగాణ ప్రాంతలో 150టిఎంసిల నీటి సామర్ధంతో శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. అందువల్లే శ్రీరాంసాగర్ మొదటి దశ, రెండవ దశలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే 150టిఎంసిల శ్రీశైలం ఎడమకాలువ టన్నెల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ఎత్తిపోతల పథకాలను ఉమ్మడి ప్రభుత్వాలు బచావత్ ట్రిబ్యునల్ ఎదుట అడుగలేదని పేర్కొన్నారు. కృష్ణాబేసిన్ పరిధిలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల కంటే బేసిన్ వెలుపల ఉన్న ఆంధ్రాప్రాంతాలకు నీటిని మళ్లించే ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వాలని అప్పటి ఆంధ్రాప్రభుత్వాలు కోరాయని లేఖలో వివరించారు.

నీటిని వాడుకునే హక్కు తెలంగాణకు ఉంది:

గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తున్న నీటిలో వాటా నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా కోరుతోందని ఈఎన్సీ మురళీధర్ కృష్ణారివర్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది నుంచి మళ్లిస్తున్న నీటిని కృష్ణాలో మిగిలే నీటిని ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చని అన్నారని , 1978 ఆగష్టు 4న గోదావరి జలాల అంతర్‌రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జున సాగర్ ఎగువన ఈ జాలలను వాడుకునే హక్కు తెలంగాణ రాష్ట్రానికి ఉందని లేఖలో స్పష్టం చేశారు.గోదావరి నది నుండి కృష్ణాబేసిన్‌కు తెలంగాణ మళ్లిస్తున్న నీటిని ఇప్పటివరకూ కృష్ణానది నీటిని ఇవ్వలేకపోయిన ప్రాంతాలకు మాత్రమే ఇస్తున్నట్టు తెలిపారు. వీటన్నింటి నేపధ్యంలో టెలిమెట్రిలు, తెలంగాణ రాష్ట్రం మళ్లించే నీటిలో వాటా ఇవ్వాలన్న ఎపి డిమాండ్ తగదని తెలిపారు.ఇందుకు సంబంధించిన వివరాలతోకూడిన రికార్డులను కూడ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానది యాజమాన్యబోర్డుకు రాసిన లేఖతోపాటు జతపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News