Thursday, July 18, 2024

నారా లోకేష్‌కి ఎపి సిఐడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కుంభకోణం కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని సీఐడీ నోటీసులో పేర్కొంది. ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో లోకేష్‌తో పాటు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. లోకేష్ నోటీసులు తీసుకుని విచారణలో అధికారులకు సహకరించాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు భూకబ్జాలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్ తదితరులను నిందితులుగా చేర్చారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌ను కూడా 14వ ముద్దాయిగా చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News