Friday, May 3, 2024

ఎపి ప్రాజెక్టులు, హోదాపై ప్రధానితో జగన్ భేటి

- Advertisement -
- Advertisement -

AP CM Jagan, PM Modi

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన కోసం బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఎపి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సిఎం కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సిఎం జగన్ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధానిమోదీతో భేటీ సందర్భంగా లేఖలో పేర్కొన్న అంశాలను ప్రధానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాలని ఎపి సిఎం ఈ సందర్బంగా కోరారు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్ వెంట ఎంపిలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్ తదితరులు ఉన్నారు.

AP CM Jagan Meets with PM Modi in New Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News