Monday, April 29, 2024

ఇక దక్షిణ తెలంగాణ ఎడారేనా?

- Advertisement -
- Advertisement -

(లక్కా భాస్కర్‌రెడ్డి)
ఎక్కడ కుప్పం ..ఎక్కడ శ్రీశైలం జలాశయం.. కొండలు గుట్టలు రాళ్లు తిప్పలు దాటుకొని ,నదీపరివాహక ప్రాంతం కూడా కాదని ఎగువన 672 కిలోమీటర్ల దూరాన ఉన్న కర్టాటక ,తమిళనాడు సరిహద్దుల్లోకి కృష్ణానదీజలాలు తరలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది పరీవాహకంగా ఉన్న పలు జిల్లాలు వేసవి రాకముందే తాగునీటికి తపించి గొంతులు ఎండబెట్టుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం కృష్ణానదీజలాలను ఈ నదీపరీవాహకం కాని ప్రాంతాలకు తరలించుకుపోతోంది. హంద్రీ-నీవా సుజల స్రవంతి పధకంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రి సమీపాన కృష్ణానది ఒడ్డున అంత్యంత శక్తివంతమైన మోటార్లు అమర్చిన పంప్‌హౌస్ నుంచి కృష్ణానదీజలాలను ఎత్తిపోసుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, ఈ ప్రాజెక్టునుంచి నీటిని ఉపయగించుకునేందు కు మినిమం డ్రా డౌన్ లెవెల్ 834అడుగులుగా నిర్ణయించారు. పోతిరెడ్డి పాడుహెడ్ రెగ్యులేటర్ ద్వారా ్రశ్రీశైలం కుడి ప్రధాన కాలుకు నీటిని శ్రీశైలం జలాశయం నుంచి విడుదల చేయాలం టే ప్రాజెక్టులో నీటిమట్టం 841అడుగుల ఎగువన ఉండాలి. ఆ స్థాయిలో నీటి మట్టం ఉన్నపుడే శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా ఒక వైపున తెలుగుగంగ పధకానికి, మరో వైపును ఎస్‌ఆర్‌బిసి పథకానికి, మధ్యలో ఎస్కేప్ చానల్ ద్వారా కర్నూలు-, కడప కాలువకు నీటిని మళ్లించుకోవచ్చు. అయితే హంద్రీనీవా పధకం ద్వారా ఎక్కడో 672కిలోమీటర్ల దూరాన తమిళనాడు ,కర్ణాటక సరిహద్దుల్లో విసిరేసినట్టుగా ఏపిలో ఒక మూలన ఉన్న కుప్పం ప్రాంతానికి కృష్ణానదీజాలను అందించాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 800అడుగులు ఉంటే చా లు. ఆ స్థాయి నీటిమట్టుం నుంచే హంద్రీ-నీవా సు జల స్రవంతి పథకానికి కృష్ణానదిలో ఉన్న నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసుకునేలా ప్రాజెక్టును నిర్మించారు. వర్షాకాలం , వేసవి కాలం అన్న తేడా లేకుండా శ్రీశైలం రిజర్వాయర్‌లో 800అడుగుల పైన 834 అడుగుల దిగువన నీరు నిలువ వుంటుంది. డెడ్‌స్టోరేజిగా భావించే ఈ నీటిని కూడా హంద్రీ-నీవా పథకానికి మళ్లిస్తున్నారు.
ఇక దక్షిణ తెలంగాణ ఏడారేనా…!
తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీ పరిపరివాహకంగా ఉన్న పదిజిల్లాలను ఎపిలోని హంద్రీ-నీవా పథకం ఎడారిగా మార్చే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ తెలంగాణ పరిధిలో ఉన్న ఈ జిల్లాలకు కృష్ణానదీజలాలే ఏకైక ఆధారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో చేపట్టిన సాగునీటి పథకాల పనులను తెలగాణ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పుడిప్పుడే ఒక్కటొక్కటిగా ప్రాజెక్టులు పనులు పూర్తి చేసుకుని పాక్షిక ప్రయోజనాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ దశలో ఎపిలోని జగన్ ప్రభుత్వం హంద్రీ-నీవా పథకం పనులు పూర్తి చేసింది. సోమవారం నాడు ముఖ్యమంత్రి జగన్ కుప్పం నియోజకవర్గంలో కృష్ణానదీజలాల విడుదలకు శ్రీకారం చుట్టారు.ఈ నియోజకవర్గం పరిధిలోని 110 చెరువులను శ్రీశైలం జలాలతో నింపేందుకు మార్గం సుగమం చేశారు. కుప్పంతోపాటు పలమేరు తదితర ప్రాంతాల్లోని నాలుగు లక్షలకు పైగా జనాభాకు కృష్ణానదీజలాలతో తాగునీటి అవసరాలను తీర్చనున్నారు. తెలంగాణలో కృష్ణానదీ పరివాహకంగా ఉన్న జోగులంబా గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, నారాయణపేట్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో వేసవికి ముందే నీటి ఎద్దడి దశాబ్దాలుగా వెంటాడుతూ వస్తోంది. తలాపున పారిపోయే కృష్ణానదీజలాలను పంపుల ద్వారా ఎత్తిపోసుకుని ఈ ప్రాంతాలను తాగు , సాగునీటిని అందిచే కృషి ఏళ్ల తరబడి కొనసాగుతోంది. మరో వైపు ఆంధప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ ప్రభుత్వం హంద్రీనీవా పధకం పనులు చకచకా పూర్తి చేసింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి 40టిఎంసీల నీటిటి 540మీటర్ల ఎత్తున , 672కిలోమీటర్ల దూరాన ఉన్న కుప్పం ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించుకుపోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News